జ్యోతిష్యం: మానసిక ప్రశాంతత లభిస్తుంది.. నెగిటివ్థాట్స్ రానే రావు.... చేయాల్సినవి ఇవే..!

జ్యోతిష్యం:  మానసిక ప్రశాంతత లభిస్తుంది.. నెగిటివ్థాట్స్ రానే రావు.... చేయాల్సినవి ఇవే..!

 చాలామంది ఎలాంటి కారణం లేకుండానే టెన్షన్​ పడతారు.  ప్రతి ఆలోచన కూడా నెగిటివ్​ గానే ఉంటుంది.  దీంతోప్రశాంతత కోల్పోతారు.  చిన్న విషయం కూడా భూతం మాదిరిగా కనపడుతుంది. ఆందోళనతో అలసిపోతారు.  ఆరోగ్యం దెబ్బతింటుంది.  ఇలాంటి లక్షణాలతో బాధపడే వారు ఓ ఎనిమిది సూత్రాలను పాటిస్తే ఆ సమస్యలన్ని దూరమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . ! 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  స్నానం, ప్రార్థన, ప్రకృతితో గడపడం, ధ్యానం చేయడం వంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే నెగిటివ్​ ఆలోచనలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .  .! 

నీరు ఒత్తిడిని తగ్గిస్తుంది:  నీరు ఒత్తిడి తగ్గిస్తుంది. రోజంతా పడిన కష్టం నుంచి రిలీఫ్​ పొందాలంటే వేడి నీటిలో కొద్దిగా ఉప్పు ( రాళ్ల ఉప్పు) వేసి స్నానం చేయండి. ఇలా చేయడం వలన శరీరంపై ఉండే ప్రతికూల శక్తి తొలగి  మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక మంచి స్నానం.. టెన్షన్​ నుంచి రిలీఫ్​అని పండితులు చెబుతున్నారు.సాల్ట్​ వాటర్​ తో  స్నానం చేయడం వలన  ఆందోళనలు, భయాలు ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ధూపం :  ఇంట్లో వాతావరణం గందరగోళంగా ఉంటే ప్రతికూల శక్తులు తిష్ట వేస్తాయి.  ఇక అంతే నెగిటివ్​ థాట్స్​ మెదడును అల్లకల్లోలం చేస్తాయి.  అలాంటప్పుడు ఏం చేస్తున్నాము...  ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామమో కూడా తెలియదు.  అందుకే నిత్యం రోజు ప్రదోష కాలంలో ( సాయంత్రం సమయంలో) స్నానం చేసి ఇంట్లోని ప్రతి గదుల్లో సాంబ్రాణి పొగ వేయాలి.  మంచి వాసన ఉంటే మరీ బెటర్​.. అగర్​ బత్తీలను ఎక్కువ పొగ వచ్చేలా వెలిగించినా సరిపోతుంది. ఆ ధూపానికి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటకు వెళతాయి.   సుగంధ ద్రవ్యాల సువాసన వ్యాపిస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని మనసును నిర్మలంగా ఉంటుంది.  అయితే ధూపం వేసేటప్పుడు గాలి ధారాళంగా వచ్చేలా ఉండాలి. 

ఆధ్యాత్మిక చింతన :  తెలియని ఆందోళన.. బాధ కలిగినప్పుడు మీరు వెంటనే కాసేపు బయటకు వెళ్లండి.  దగ్గరలో దేవాలయం ఉంటే స్నానం  చేసి ఉతికిన బట్టలు ధరించి గుడికి వెళ్లండి.  లేదంటే  చెట్ల మద్యన నడరవం.. పచ్చని గడ్డిపై పాదాలు ఉంచి సేద తీరడం.. పార్క్​లకు వెళ్లండి. ఇలా చేయడం వలన ఆలోచనల్లో మార్పు కలుగుతుంది.  నడిచేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలచుకోండి. ఆధ్యాత్మిక శక్తితో భయం, ఆందోళన తొలగుతుంది. సైంటిఫిక్​ గా  ప్రకృతిలో గడిపే కొద్ది సమయం మీ ఆలోచనలకు కొత్త శ్వాసను ఇస్తుంది.

►ALSO READ | జ్యోతిష్యం: సింహరాశిలో గురుడు సంచారం.. 2027 జనవరి 25 వరకు వీరు పట్టింది బంగారమే..!

నిద్రపోయే ముందు:  బెడ్​ ఎక్కగానే ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేయండి.  ఆ రోజులో మీరు చేసిన పనులను ఒకసారి సమీక్షించుకోండి.. వాటివలన నష్టం కలుగుతుందేమో ఒక సారి ఆలోచించండి.. అలాంటి వాటిని వెంటనే వదిలేయండి. ఆ తరువాత నిశబ్ధంగా ప్రార్థన చేస్తూ కళ్లు మూసుకోండి. మీ మనసుకు నచ్చిన భక్తిపాటను వినండి.  సంగీతాన్ని ఆలకించండి.  ఇది మెదడును ప్రశాంత పరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వలన మనసుకు ప్రశాంతత లభించి .. మరుసటి రోజు నూతనోత్సాహంతో అన్ని పనులు పూర్తవుతాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.