టెక్కీలకు యాక్సెంచర్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీ బోనస్!

టెక్కీలకు యాక్సెంచర్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీ బోనస్!

గ్లోబల్ ఐటీ సర్వీసెస్ దిగ్గజం యాక్సెంచర్ భారతీయ ఉద్యోగులకు నవంబర్ 2026 రివార్డ్ సైకిల్ కింద కీలక ప్రకటన చేసింది. కంపెనీలో టాప్ పెర్ఫార్మర్లకు 26 శాతం వరకు పనితీరు ఆధారిత బోనస్‌ ప్రకటించింది. ఇదే క్రమంలో ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్స్ విషయంలో మాత్రం నిరాశే మిగిలింది. 

బోనస్ వివరాలు ఇలా.. 
ఉద్యోగుల పనితీరును బట్టి బోనస్ ఎంత శాతం చెల్లించాలో యాక్సెంచర్ డిసైడ్ చేసింది. హైయెస్ట్ పెర్ఫార్మర్లకు 26 శాతం వరకు బోనస్ లభిస్తుండగా.. లోయెస్ట్ కేటగిరీలో ఉన్న అర్హత కలిగిన ఉద్యోగులకు 8 శాతం వరకు బోనస్ అందిస్తున్నారు. ఇక నాన్-పెర్ఫార్మర్లుగా వర్గీకరించిన ఉద్యోగులకు మాత్రం ఎలాంటి బోనస్ ఎటువంటి బోనస్ అందించలేదంట. 

ప్రపంచవ్యాప్తంగా యాక్సెంచర్‌ సంస్థలో పనిచేస్తున్న 8 లక్షల మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్‌లోనే ఉన్నారు. కాబట్టి తాజా బోనస్ ప్రకటన భారతీయ ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఉద్యోగుల సీనియారిటీని బట్టి బోనస్ షెడ్యూల్స్ మారుతుంటాయి. టీమ్ లీడ్స్ వంటి కెరీర్ లెవల్ 9 వరకు ఉన్న ఉద్యోగులకు సంవత్సరానికి 2 సార్లు(జూన్, నవంబర్) బోనస్ ఇస్తుండగా.. ఆపైన ఉన్నవారికి ఏడాదికి ఒకసారి నవంబర్‌లో అందజేస్తారు.

శాలరీ హైక్స్, ప్రమోషన్స్
బోనస్‌ల పరంగా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ.. జీతాల పెంపు విషయంలో మాత్రం టెక్కీలకు నిరాశే ఎదురైంది. ఒకే కెరీర్ లెవెల్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు ఈసారికూడా శాలరీ హైక్స్ లభించలేదు. అదేవిధంగా ప్రమోషన్స్ కూడా చాలా పరిమితంగానే ఉన్నట్లు సమాచారం. గతేడాది జూన్ సైకిల్‌లో లెవెల్ 8, అంతకంటే పైస్థాయి ఉద్యోగులకు 3 శాతం నుంచి 13 శాతం వరకు వేతనాలు పెంచినప్పటికీ.. ప్రస్తుత నవంబర్ సైకిల్ పూర్తిగా బోనస్‌ల మీదే ఫోకస్ పెట్టింది. మెయిన్ ప్రమోషన్లు, బేస్ పే రివిజన్ సైకిల్‌ను జూన్‌కు మార్చడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నవంబర్-డిసెంబర్ కాలంలో కేవలం పనితీరు ఆధారిత బోనస్‌లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

►ALSO READ | మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగాలన్న ఎయిర్ టెల్ అధినేత.. రీఛార్జ్కి నెలకు కనీసం ₹350 కట్టాలంట !

ప్రస్తుతం గ్లోబల్ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో అనిశ్చితి నెలకొంది. క్లయింట్లు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటం, AI టెక్నాలజీలపై పెట్టుబడులు మారుతుండటంతో ఐటీ కంపెనీలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో కంపెనీ ఉద్యోగులకు హైక్స్ నిలిపివేసి, కేవలం పెర్ఫార్మర్లకు మాత్రమే భారీ బోనస్‌లు అందించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొత్తానికి టెకీలకు బోనస్ రూపంలో పండగ వాతావరణం వచ్చినప్పటికీ, జీతాలు పెరగకపోవడం నిరాశ కలిగిస్తోంది.