ఎన్విడియో మాజీ సీఈవోకు మూడో ఎఫైర్ ఉందంట.. ఇంకెంత మంది ఉన్నారయ్యా!

ఎన్విడియో మాజీ సీఈవోకు మూడో ఎఫైర్ ఉందంట.. ఇంకెంత మంది ఉన్నారయ్యా!

 జెన్‌సెన్ హువాంగ్.. ప్రపంచ టెక్ దిగ్గజాలలో ఒకరు. 33 ఏళ్లుగా ఎన్ విడియాను టాప్ మోస్ట్ కంపెనీగా తీర్చిదిద్దటంలో కీలకపాత్ర పోషించిన ఈ సీఈఓ.. కలలో కూడా ఊహించి ఉండడు. కంపెనీకోసం ఇంత చేసి.. ఇంత పేరు ప్రతిష్టలు గడించిన తను.. చివరి రోజుల్లో ఇలాంటి వివాదాల మధ్య చిక్కుకుంటానని. ఇన్నాళ్లుగా సంపాదించిన గౌరవం ఒక్క సారిగా కుప్పకూలిపోతుందని. అయితే చైనా స్పై ఏజెంట్ తో ఎఫైర్ కారణంగా కంపెనీ చిప్స్ తో పాటు కీలక డేటా చేరవేసినట్లు అనుమానాలు తలెత్తుతున్న సందర్భంలో.. ఒకటి కాదు రెండు.. కాదు మూడు అంటూ ఒకదాని తర్వాత మరో ఎఫైర్ బయటకు వస్తున్నాయి. లేటెస్టుగా మూడో ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్‌సెన్ హువాంగ్‌కు కంపెనీలోని మరో ఉద్యోగితో ఎఫైర్ ఉన్నట్లు రాయిటర్స్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్టులో పేర్కొంది.  రెండు ఎఫైర్ల వార్తల కారణంగా 2026 నవంబర్ 12 ను హువాంగ్  రాజీనామా చేయడానికి దారితీసింది. ఆ తర్వాత మూడో సంబంధం గురించి బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

జెన్ సెన్ హువాంగ్ ఎఫైర్లలో ఇప్పటికే రెండు బయటికి వచ్చాయి.   చైనా గూఢచారిణిగా అమెరికా ఇంటెలిజెన్స్  అనుమానిస్తున్న మహిళ ఆలిస్ హువాంగ్ , ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ కింబర్లీ పావెల్. వీరిద్దరితో ఎన్ విడియా సీఈవో వివాహేతర సంబంధాలు నడిపినట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో.. కంపెనీలోని మరో ఉద్యోగితో ఎఫైర్ ఉందని బయటకు రావడం సంచలనంగా మారింది.

అయితే రాయిటర్స్ ఈ రెండో ఉద్యోగి పేరు వెల్లడించలేదు. ఆ మహిళను సంప్రదించే ప్రయత్నాలు చేసినప్పటికీ అది విఫలమైనట్లు పేర్కొంది. దీనిపై కామెంట్ చేయడానికి ఎన్విడియా  నిరాకరించింది. హువాంగ్, పావెల్, ఎన్విడియా బోర్డు ప్రతినిధి స్పందించలేదు.  

హువాంగ్ నవంబర్ 8న ఉద్యోగులకు రాసిన లేఖలో తన భార్యకు విశ్వాసఘాతకం చేశానని ఒప్పుకున్నారు. కానీ ఆలిస్ హువాంగ్ పేరు ప్రస్తావించలేదు. ఆ తర్వాత న్యూయార్క్ టైమ్స్ పావెల్‌తో సంబంధం ఉందని రాసుకొచ్చింది. ఈ రెండు ఆరోపణల కారణంగా సడెన్ గా  రాత్రిపూట బోర్డు సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. 

ప్రస్తుతం సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. హువాంగ్ 33 సంవత్సరాలపాటు ఎన్విడియాను నడిపి ప్రపంచంలోని అత్యంత విలువైన ఏఐ కంపెనీల్లో ఒకటిగా మార్చారు. కానీ ఎఫైర్ల కారణంగా 33 ఏళ్ల పాలనకు రాజీనామా చేయాల్సి వచ్చింది.  ఈ సంఘటనల తర్వాత కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి.