ఎన్వీడియా స్టాక్ క్రాష్.. ఈ 13 మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులకు నష్టాలేనా?

ఎన్వీడియా స్టాక్ క్రాష్.. ఈ 13 మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులకు నష్టాలేనా?

గ్లోబల్ టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పరిణామం ఇది. AI చిప్‌లకు మారుపేరైన ‘ఎన్వీడియా’ కంపెనీలో నాయకత్వ సంక్షోభం తలెత్తడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా మార్కెట్లలో ఎన్వీడియా షేరు ఏకంగా 6.04 శాతం పడిపోయి 163.23 డాలర్లకు పడిపోయింది. ఒక్కరోజే 10.50 డాలర్లు కోల్పోయింది. గతంలో గరిష్ట స్థాయి అయిన 243.37 డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం మేర తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అనూహ్య పరిణామాల వెనుక అసలు కారణం.. ఎన్వీడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ సీఈఓ పదవికి రాజీనామా చేయడం. ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టినప్పటికీ.. మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో అమెరికా మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులపై ఆధారపడే భారతీయ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో గుబులు మొదలైంది. మా పెట్టుబడులు సురక్షితమేనా? ఏయే ఫండ్స్‌పై దీని ప్రభావం పడుతుంది? అనే ఆందోళనలు ఇండియన్ ఇన్వెస్టర్ల నుంచి వినిపిస్తున్నాయి. 

ఎన్వీడియాలో ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎంత శాతం ఉన్నాయంటే?
1. Mirae Asset S&P 500 Top 50 ETF: 12.12% 
2. Mirae Asset NYSE FANG+ ETF: 10.02%
3. Motilal Oswal Nasdaq 100 ETF: 8.02%
4. ICICI Prudential NASDAQ 100 Index Fund: 8.02%
5. Motilal Oswal s&p 500 Index Fund: 7.56%
6. Aditya Birla Sun Life International Equity Fund: 4.91%
7. Edelweiss Technology Fund: 4.74%
8. DSP Multi Allocation Fund: 1.44%
9. Axis Innovation Fund: 1.36%
10. Franklin India Technology Fund: 1.12%
11. DSP Value Fund: 0.91%
12. ICICI Pru US Bulechip Equity Fund: 0.66%
13. Axis Large & Mid Cap Fund: 0.63%

పతనంతో భారతీయ ఇన్వెస్టర్లపై ఎఫెక్ట్: 
ఎన్వీడియా షేర్లు పడిపోయినంత మాత్రాన ఆయా ఫండ్స్ ఎన్‌ఏవీ (NAV) అదే స్థాయిలో పడిపోతుందని భయపడాల్సిన పనిలేదు. ఒక ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఎన్వీడియా వెయిటేజీ ఎంత ఉందనే దానిపైనే నష్టం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 12 శాతం వాటా ఉన్న ఫండ్‌పై ఎన్వీడియా 10 శాతం పడిపోతే సుమారు 1.2 శాతం వరకు ప్రభావం పడవచ్చు. ఎక్స్‌పోజర్ ఎంత తక్కువ ఉంటే నష్టం అంత తక్కువగా ఉండొచ్చు. ఇదే క్రమంలో విదేశీ పెట్టుబడులు ఉన్నప్పుడు రూపాయి-డాలర్ మారకం విలువ కూడా రాబడులను ప్రభావితం చేస్తుందని ఇన్వెస్టర్లు గుర్తించాలి.