హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ షెడ్యూ్ ల్ ను కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. శుక్రవారం( నవంబర్ 13) న ఉదయం11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భారత్ సమ్మిట్ రెండో సెషన్ లో తెలంగాణ రైజింగ్ పై స్పెషల్ డిస్కషన్లు కొనసాగుతాయి. ఆర్థిక వేత్తలు థామస్ పికెట్టి, విదేశీ నేతలు ఈ సమ్మిట్ లో పాల్గొంటారు. రేపు (నవంబర్ 14 ) గ్రిగ్ వర్కర్లతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ర్యాలీ ఉంటుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
భారత్ సమ్మిట్ లో భాగంగా ఏడు అంతర్జాతీయ ప్యానెల్ చర్చలు, నాలుగు తెలంగాణ ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. మాజీ పీఎం జవహర్ లాల్ నెహ్రు 137 వ జయంతి సందర్బంగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ ను అత్యంత ప్రాధాన్యత ఉంది. 1955లో జరిగిన బాండుంగ్ సదస్సు ద్వారా అలీనోద్యమానికి నెహ్రూ పునాదులు వేశారు. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఇదిలా ఉంటే.. రేపు(శనివారం నవంబర్14) ) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, గాంధీ గిగ్ వర్కర్లతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని జయభేరి గార్డెన్స్‌లో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. గిగ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
