ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కైలాస్ టేకిడి, అజ్జర వజ్జర ప్రాంతంలో ఒకేసారి మూడు పులుల సంచారం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది. కైలాస్ టేకిడి అటవీ ప్రాంతంలో 2026 నవంబర్ 13న ఆవు పై పులి పంజా విసరడంతో ఆవు ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కైలాస్ టేకిడి, అజ్జరవజ్జర, నిగిని ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నా యని అటవీ అధికారులు తెలిపారు. బోథ్ ,మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పులు సంచరిస్తుండటంతో అటవీ ప్రాంతానికి వెళ్లడానికి పశువుల, గోర్రేల కాపరులు భయపడుతున్నారు. పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో రైతులు పంటపోలాలకు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పులుల సంచారంపై పరిసర గ్రామాల రైతులకు అటవీ అదికారులు, ఎన్జీఓ ప్రతినిధులు అవగాహన కల్పించారు. టైగర్ ట్రాకర్స్ పులులను ట్రాకింగ్ చేస్తున్నాయి. పులులను గుర్తించడానికి యాబై ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అదికారులు తెలిపారు. అదే సమయంలో పులలకు ఉచ్చులు బిగించవద్దని రైతులను కోరుతున్నారు.
