ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వెర్రి వేషాలు వేస్తున్నవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. రీల్స్ ద్వారా ఫేమ్ సంపాదించి ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అవ్వాలని పిచ్చితో ప్రాణాల మీదకు టెహ్సుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న బైక్ ట్యాంక్ మీద అమ్మాయిని కుర్చోబెట్టుకొని చిలిపి పనులు చేస్తూ బైక్ నడిపాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సందీపన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసేడీ గ్రామం సమీపంలో, రామ్వన్ గమన్ మార్గ్‌పై ఈ సంఘటన జరిగింది. TVS Apache బైక్ నడుపుతున్న యువకుడు మితిమీరిన వెళ్తున్నాడు. బైక్ ట్యాంక్‌పై ముందు వైపు కూర్చున్న యువతి అతన్ని చేతులతో చుట్టేసి కూర్చుంది . ఇతర వాహనాలు తిరుగుతున్న రహదారిపై ఇద్దరూ ట్రాఫిక్‌ను కూడా పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు.
कौशाम्बी: चलती बाइक पर रोमांस और स्टंट का वीडियो वायरल महिला को आगे बैठाकर युवक ने किया खतरनाक स्टंट चलती बाइक पर किस करते भी दिखे युवक-युवती संदीपन घाट के रामवन गमन मार्ग का बताया जा रहा वीडियो वायरल वीडियो में बाइक का नंबर भी साफ नजर आया। #viralvideo #KAUSHAMBI #UttarPradesh
— Asian News UP/UK (@AsianNewsUP_UK) November 11, 2026
రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ సీన్ ని మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో బైక్ నంబర్ స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.వీడియో వైరల్ అవడంతో స్థానికులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. వారిద్దరూ తమ ప్రాణాలను మాత్రమే కాకుండా, హైవేపై ఉన్న ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
హెల్మెట్ ధరించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ వీడియో వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కౌశాంబీ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.
వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. నిందితులను గుర్తించిన తర్వాత మోటార్ వెహికల్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.
