గోల్కొండ సమీపంలో ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహన బోల్తా కొట్టడంతో ప్రమాదం జరిగింది. 2026 నవంబర్ 13న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అల్లావాడ గేట్ దగ్గర ఆర్మీ బండి బోల్తా పడింది. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 8 మంది కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ మండలంలోని ట్రైనింగ్ పర్పస్ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో 14 మంది ప్రయాణిస్తుండగా ఎనిమిది మందికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రైనర్ బండి నడిపిస్తున్న క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టింది వాహనం. పల్టీలు కొడుతూ చెట్టుకు తగిలి ఆగిపోయింది. గాయపడ్డ జవాన్లను వెంటనే గోల్కొండ ఆర్మీ హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలించారు. జవాన్ల కండిషన్ పై ఆర్మీ అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
