చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలున్న వ్యక్తులను అస్సలు నమ్మొద్దు... మోసపోతారు జాగ్రత్త..!

చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలున్న వ్యక్తులను అస్సలు నమ్మొద్దు... మోసపోతారు జాగ్రత్త..!

ఎవరు ఏది చెపితే అది నమ్మితే  ఒక్కోసారి మోసపోతాం.. ఇప్పుడు సమాజంలో అలాంటి ఘటనలే జరుగుతున్నాయి.  మీకు ఎవరో ఫోన్​ చేసి లింక్​ పంపుతున్నాం.. ఓపెన్​ చేయడం.. మీకు లక్షల రూపాయిలు వస్తాయి అని చెప్పగానే నమ్మి ఓపెన్​ చేశామా డబ్బులు రాకపోగా ఉన్నవి పోతాయి.  అలాంటి నమ్మకాలతోనే మోసాలు జరుగుతాయని చాణుక్యనీతి ద్వారా తెలుస్తుంది.

మీకు సమాజంలో చాలా మంది పరిచమవుతుంటారు.  ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతుంటారు.  ఎవరు చెప్పేది నమ్మాలో... ఎవరు చెప్పినది నమ్మకూడదో  తెలియదు.  ఎవరినో ఒకరిని నమ్మాలి కదా అని కొంతమంది మాటలను నమ్ముతుంటాం.  ఒక్కోసారి మనకు తెలియకుండానే మోస పోతుంటామని చాణక్యుడు నీతి సూత్రాల్లో తెలిపారు.

చాణక్య నీతి సూత్రాల ప్రకారం మీకు నమ్మకంగా చెప్పే వ్యక్తుల స్వభావాన్ని, ప్రవర్తనను ముందుగా పరిశీలించాలి.  వారిలో ఓ మూడు లక్షణాలను గుర్తిస్తే వారి మాటల్లో ఎంత నిజం ఉందో పరిశీలించుకోవాలి. 

ఏదైనా ఒక విషయాన్ని మీకు నమ్మకంగా చెప్పేటప్పుడు అవసరానికి మించి కబుర్లు చెప్పేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ప్రతి సందర్భంలో  అంటే ... మీతో మాట్లాడే సమయంలో ఎక్కువ సమయం మీ మాటను సమర్థిస్తూ.. మిమ్ములను పొగుతతూ ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిమ్ములను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అసలు వారి వలన ఆ పని ఎంతవరకు అవుతుంది అనే విషయాన్ని గ్రహించాలి.  ఒక్కోసారి వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  అలాంటి  వారిని నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.  


రెండో విషయానికి వస్తే మీతో చాలామంది అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతారు.  ఆ తరువాత కనీసం ఫోన్​లో కూడా మాట్లాడరు... మెసేజ్​ కు కూడా స్పందించరు.  అలాంటి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు..  సాధారణ రోజుల్లో మాట్లాడకుండా.. మీరు  కష్టాల్లో ఉన్నప్పుడు  కనీసం మాట కూడా మాట్లాడని వారి మాటలు అస్సలు నమ్మవవద్దు. వారికి పని ఉంటేనే మీ దగ్గరకు వచ్చి.. మీరు నమ్మే విధంగా ముచ్చట్లు చెబుతుంటారని గ్రహించండి.  అలాంటి వారి ప్రేమ, పని  అపారమైన ఆప్యాయత చూపించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ALSO READ : మంచి సంతానం కలగాలా... కొత్త దంపతులు నవంబర్ 15న చేయాల్సింది ఇదే..!

మూడో రకానికి చెందిన వ్యక్తులు ప్రతి విషయాన్ని కూడా డైరక్ట్​గా చెప్పరు.  నేరుగా చెప్పకుండా ఇన్​ డైరక్ట్​ గా చెబుతుంటారు.  ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతుంటే వేరే విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తారు.  ఒక్కోసారి ఇలా జరగడం సహజమైనా, ఇది పదే పదే జరుగుతుంటే ఆ వ్యక్తి ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలని చాణక్య నీతి సూత్రాల ద్వారా తెలుస్తుంది.