ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
- మొత్తం ఖాళీలు: 120.
- విభాగాల వారీగా ఖాళీలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ 90, మేనేజర్ 30.
- మేనేజ్‌మెంట్ ట్రైనీ: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్ లేదా సమాన ప్రొఫెషనల్ అర్హత కలిగి ఉండాలి. ప్రత్యేక విభాగాలను బట్టి అర్హతల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
- మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- అలాగే, కనీసం 4 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- వయసు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- మేనేజర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి లేదు.
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్
- వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: డిసెంబర్ 11.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల వెయిటేజీ ఆధారంగా ఖరారు చేస్తారు. రాత పరీక్ష మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 30 శాతం వెయిటేజీ కేటాయించారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.eximbankindia.inను సందర్శించండి.
