TGPSC Jobs: అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది

TGPSC Jobs: అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది

 

హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TPCB)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో పాటు మార్కుల జాబితాను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

20 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది. మొత్తం 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. రాష్ట్రవ్యాప్తంగా 19,568 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 24న కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా 2026 అక్టోబర్ 24న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ అనంతరం కమిషన్ ఎంపిక జాబితాను విడుదల చేసింది.

19 మంది అభ్యర్థుల ఎంపిక

మొత్తం 20 ఖాళీలకు గాను 19 మంది అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మిగిలిన ఒక పోస్టుకు సంబంధించి ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.హెచ్‌హెచ్ (HH) కేటగిరీకి సంబంధించిన ఒక పోస్టు విషయంలో మెడికల్ బోర్డు నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రస్తుతం 19 మంది అభ్యర్థుల తాత్కాలిక ఎంపికను ప్రకటించారు.

►ALSO READ | ICMR లో సైంటిస్ట్ పోస్టులు... 

మార్కుల జాబితా ఎలా చూడాలి?

అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల ఎంపిక జాబితా, మార్కుల వివరాలను పరిశీలించుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: https://websitenew.tgpsc.gov.in/

అభ్యర్థులు పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని టీజీపీఎస్సీ సూచించింది.