Vastu tips: బెడ్ రూంలో ఈ వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.. నెగిటివ్ ఎనర్జీ తిష్టవేస్తుంది జాగ్రత్త..!

Vastu tips:  బెడ్ రూంలో ఈ వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.. నెగిటివ్ ఎనర్జీ తిష్టవేస్తుంది జాగ్రత్త..!

ఇంటి నిర్మాణమే కాదు.. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కూడా వాస్తుశాస్త్రంలో ఉంది.  చాలామంది తెలియక కొన్ని వస్తువులను ఇంట్లో  వాస్తు ప్రకారం ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో ఉంచుతారు.  దీనివలన అనేక సమస్యలు వస్తాయి. ప్రోబ్లమ్స్​ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు.  అయితే ముఖ్యంగా చాలామంది బెడ్​ రూంలో ఉండకూడని వస్తువులు ఉంచుతారు.. వాటివలన ఇంట్లోకి నెగిటివ్​ ఎనర్జీ తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు.  బెడ్​రూంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

 బెడ్‌రూమ్‌లో తెలియకుండా చేసే  కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి దంపతుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు సిద్దాంతులు చెబుతున్నారు.  సాధారణంటా బెడ్​ రూంలో స్ట్రెస్​ నుంచి రిలీఫ్​ పొందుతారు.  అలాంటి గదిలో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఇంట్లోనే నరకం కనపడుతుంది కదా మరి..!

బెడ్​కు ఎదురుగా అద్దం:  సాధారణంగా బెడ్​ రూంలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు.  చాలామంది మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్​ టేబుల్​ పెడతారు. నిద్రపోయే సమయంలో మన ప్రతిబింబం అద్దంలో కనపడకూడదు.  ఇలా ఉండటం వలన మానసికంగా చాలా ఇబ్బందులు వస్తాయి.  ఇంకా ఆరోగ్య పరంగా మానసిక ప్రశాంతతకు చాలా ఇబ్బంది కలుగుతుంది.  బెడ్​ రూంలో అద్దం ఉండకుండా ఉంటే చాలామంచిది.  సాధరణంగా డ్రెస్సింగ్​ టేబుల్​ బెడ్​ రూంలోనే పెట్టుకుంటారు కాబట్టి ఆ అద్దంపై  రాత్రి సమయంలో  మీ ప్రతిబింబం అందులో పడకుండా ఒక క్లాత్ కప్పేయడం చాలా మంచిదని వాస్తు సిద్దాంతం ద్వారా తెలుస్తుంది. 

ఎలక్ట్రానిక్ వస్తువులు అస్సలు ఉండకూడదు:  ప్రస్తుతం బెడ్​పై సెల్​ఫోన్​ .. ల్యాప్​ట్యాప్​ వంటి ఎలక్ట్రానిక్​వస్తువులు ఉంచుతున్నారు. బెడ్​ రూం అంటే రెస్ట్​ రూం.. ఇందులో టీవీ, ల్యాప్​ ట్యాప్​, మొబైల్​ ఉంటే  వాటి నుంచి వచ్చే ఎలక్ట్రోమ్యాగ్నటిక్​ తరంగాల వలన నిద్రకు చాలా ఇబ్బంది కలుగుతుంది.  వాల్​ క్లాక్​ కూడా ఉండకూడదు.  అందులో సెకన్ల ముల్లు తిరిగేటప్పడు సౌండ్​ వస్తుంది.  రాత్రి సమయంలో పడుకునే ముందు ఫోన్లను స్విచ్​ ఆఫ్​ చేయడం వాస్తు ప్రకారం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. 

 ముళ్ళ మొక్కలు:  బెడ్​ రూం అందంగా ఉండాలని కొంతమంది ముళ్లు ఉండే క్యాక్టస్​ మొక్కలను షెల్ఫ్​ ల్లో ఉంచుతారు.  వీటి వలన అశాంతి కలుగుతుంది.  అలాగే ఎండిపోయిన పువ్వులు బెడ్​ రూంలో ఉంటే వెంటనే తొలగించండి.

మంచం కింద చెత్తాచెదారం :  చాలా మంది పనికి రాని సామానును మంచం కింద స్టోర్​ చేస్తారు.  పెద్ద పెద్ద గిన్నెలు..పాత బాక్సులు మంచం కింద ఖాళీ లేకుండా సర్దేస్తారు. మంచం కింద వస్తువులు ఉంటే మానసిక ఒత్తడి పెరగడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు వస్తాయి.  అందుకే మంచం కింద ఎలాంటి వస్తువులు పెట్టకూడదు.  రోజు మంచం కింద చీపురితో శుభ్రం చేయాలి. లేదంటే ప్రతికూల శక్తి చేరుతుంది. 

►ALSO READ | చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలున్న వ్యక్తులను అస్సలు నమ్మొద్దు... మోసపోతారు జాగ్రత్త..!

ప్రశాంతతకు భగ్నం కలిగించే ఫోటోలు:  బెడ్​ రూం డోర్​.. వాల్స్​ అందంగా ఉండాలని కొంతమంది  ప్రకృతి దృశ్యాలు.. హింసతో కూడిన నెగిటివ్​ ఫోటోలను ఉంచుతారు.  పొరపాటున కూడా క్రూర మృగాల ఫొటోలను.. బ్యాడ్​ సింప్టమ్స్​ కలిగించే ఫొటోలు.. యద్దాలకు సంబంధించిన చిత్రాలు వంటివి ఉంటే వెంటనే తీసేయండి. ఇవి బెడ్​ రూంలో ఉండే మీ మైండ్​ అల్లకల్లోలంగా పని చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. 

మార్నింగ్​ టైం బెడ్​ రూం కిటికీలు ఓపెన్​ చేయండి.. గాలి వెలుతురు వచ్చేలా చూసుకోండి.  రోజూ సాయంత్రం పడుకొనే సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును ఉంచి ఆ గిన్నెను బెడ్​ రూంలో ఉంచితే అక్కడ ఉండే ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది.  తెల్లవారిన తరువాత ఆ ఉప్పును నీళ్లలో కలిపి ఆ నీరును ఎవరూ తొక్కని ప్రదేశంలోకాని.. ఏదేని చెట్టు మొదట్లోకాని పోయండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  వాస్తు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.