హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎర్రమంజిల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
మృతుడిని అల్వాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాద మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
