కార్తీకమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెల శివ కేశవులను ఎంతో భక్తితో పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ప్రతి రాశి వారు కొన్ని మంత్రాలను పఠించి.. కొన్ని పరిహారాలను పాటిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి : ఈరాశికి కుజుడు అధిపతి ..కార్తీక మాసంలో 'ఓం మహాకాళాయనమః' మరియు 'ఓం నమః శివాయ' మంత్రాలను జపించాలి. ఇలాచేయడం పరమేశ్వరుని అనుగ్రహంతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రాశి వారు కార్తీకమాసంలో దీపదానం చేయడం వలన అన్ని సమస్యలకు పరిష్కారం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈరాశికి శుక్రుడు అధిపతి . ఈ రాశి వారు ఓం విశ్వనాథ నమః' మరియు 'ఓం నాగేశ్వరాయ నమః' మంత్రాలను కార్తీకమాసంలో శ్రద్దగా పఠించాలి. బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి. కార్తీక సోమవారం రోజుల్లో పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
మిథున రాశి: ఈరాశికి బుధుడు అధిపతి .. కార్తీకమాసంలో 'ఓం విష్టారి నమః' మంత్రాన్ని జపం చేయడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. సోమవారం ఆవుపాలతో అభిషేకం చేయాలి. అన్నదానం చేయాలి.
కర్కాటక రాశి: ఈరాశికి చంద్రుడు , కాబట్టి 'ఓం చంద్రమౌళేశ్వర నమః' మంత్రాన్ని 108 సార్లు భక్తితో పఠించాలి. దీని వలన పరమేశ్వరుడితో పాటు చంద్రుడి ఆశీస్సులు కలుగుతాయి. ఈమంత్రాన్ని జపం చేయడం వలన శాంతి .. శ్రేయస్సు కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచించే ఙ్ఞానం కలుగుతుంది.
సింహ రాశి: ఈరాశికి సూర్యుడు అధిపతి .. కార్తీకమాసంలో ఈ రాశివారు ఓం రుద్రనాథ నమః మరియుల 'ఓం మహాకాళాయ నమః' మంత్రాలను జపం చేయడం వలన ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి: ఈరాశికి బుధుడు అధిపతి .. సకల కార్యసిద్ధి కోసం ఈ రాశి వారు కార్తీకమాసంలో ఓం త్రిపురారి నమః అనే మంత్రాన్ని పఠించాలి.దీని వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | కార్తీకమాసం:కార్తీక దీపాల ప్రమిదలో ఎన్నివత్తులు వెలిగించాలి.. ఇంటి గుమ్మం దగ్గర దీపారాధన నియమాలు ఇవే..!
తులా రాశి: ఈరాశికి శుక్రుడు అధిపతి... కార్తీకమాసం శివుడి ఆరాధన సమయంలో తులా రాశి వారు ఓం దిననాథ నమః' మరియు 'ఓం నందీశ్వరాయ నమః' మంత్రాలను జపించాలి. అలాగే సోమవారం చెరుకురసంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన పరమేశ్వరుని దీవెనలు పుష్కలంగా కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈరాశికి కుజుడు .. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి 'ఓం మహేశ్వర నమః' మంత్రాన్ని పఠించాలి. సోమవారం స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయాలి. గురువారం పేదలకు అన్నదానం చేయాలి. పౌర్ణమి రోజున శివాలయం అర్చకులకు స్వయంపాకం ,దక్షిణ తాంబూలం ఇవ్వాలి.
ధనుస్సు రాశి: ఈరాశికి గురుడు అధిపతి కాబట్టి 'ఓం దేవదేవేశ్వర నమః'.. 'ఓం నమో శివాయ గురుదేవాయ' మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపం చేయడం వలన పరమేశ్వరుని అనుగ్రహం కలిగి కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈరాశికి శని దేవుడు అధిపతి .. శని భగవానుడు శుభ ఫలితాలను కలుగజేసేందుకు కార్తీకమాసంలో ఓం శివదానీ నమః అనే మంత్రాన్ని పఠించాలి. శనివారం ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయాలి. శని దేవుడికి తైలాభిషేకం చేసి.. బెల్లం.. నువ్వులు సమర్పించాలి. ఈ పరిహారాలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి .. మానసిక ప్రశాంతత కోసం ఓం పటాలేశ్వర నమః అనే మంత్రాన్ని జపించడం వలన శాంతి కలుగుతుంది. సోమవారం పరమేశ్వరునికి అభిషేకం... శనివారం శని భగవానుడికి తైలాభిషేకం.. కార్తీక పౌర్ణమి రోజున పేదలకు అన్నదానం.. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.
మీన రాశి: ఈరాశికి గురుడు అధిపతి.. కార్తీకమాసం శివారాధన సమయంలో 'ఓం మహాదేవ నమః' లేదా 'ఓం గురు దేవాయ నమః' మంత్రాలను 108 సార్లు పఠించాలి. దీని వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. గురువారం దక్షిణామూర్తి స్ర్తోత్రం పఠించాలి. పేదలకు ధనసహాయం చేయండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
