TTD News: ఆచారాలకు తిలోదకాలిస్తున్న టీటీడీ.. కొప్పెర గ్రామస్తుల ఆవేదన

TTD News: ఆచారాలకు తిలోదకాలిస్తున్న టీటీడీ.. కొప్పెర గ్రామస్తుల ఆవేదన

ధర్మో రక్షతి రక్షిత: అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలూ కాపాడుతుంది.  ప్రతి దేవాలయానికి ఆచారాలు.. సంప్రదాయాలు ఉంటాయి.  వాటిని కచ్చితంగాపాటించి తీరాల్సిందే.. కాని తిరుమల వెంకన్న ఆలయాలనికి చాలా ఆచారాలు ఉన్నాయి. తిరుమల ఆచారాలను టీటీడీ అధికారులు తుంగలో తొక్కుతున్నారని కొప్పెర గ్రామస్తులు మండి పడ్డారు.

కొప్పెర గ్రామస్తులకు ఆనవాయితీగా  1821 జూలై 25 నుండి కొప్పెర ఉండి  శ్రీవారికి ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తున్నారు.  ఈ గ్రామానికి చెందిన 30 నుంచి 40 మందికి స్వామి వారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించేలా సంప్రదాయం కూడా ఉంది. అయితే 2024 నుంచి ఈ ఆనవాయితీని కాదని కేవలం ఆరుగురికి మాత్రమే టీటీడీ అధికారులు  దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పెర కుటుంబాలకు చాలా మంది ఆడబిడ్డలున్నారని.. వారికి స్వామి దర్శనం కలిగించకపోతే ఎలా అని టీటీడీ అధికారులు కొప్పెర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చాలా తరాల నుంచి  అష్టలక్ష్మి గంగాళాన్ని ఇస్తున్నామన్నారు.

అదనపు ఈవోగా  వెంకయ్య చౌదరి వచ్చినప్పటి నుండి మాకు దర్శనాలు రద్దు చేశారు. ఈ సంవత్సరం గంగాళాన్ని టిటిడి కి ఇచ్చే విధానాన్ని నిలిపివేస్తున్నామని తెలిపారు.  ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కొప్పెర గ్రామస్తులు తెలిపారు. తమకు ఇస్తున్న పాత ఆచారాన్ని  కొనసాగించేంతవరకు పోరాడుతామని  కొప్పెర వంశం  కుటుంబ సభ్యుడు సురేష్  తెలిపారు.