తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలంటూ డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో డిపోలకే పరిమితమయ్యాయి ఎలక్ట్రిక్ బస్సులు. వేతనాలు తక్షణమే పెంచాలంటూ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ హైర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలిపిరి డిపో ముందు ఆందోళనకు దిగారు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు. దీంతో సరిపడా బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు శ్రీవారి భక్తులు.
ప్లే స్లిప్పులు ఇవ్వాలని.. గుర్తింపు కార్డులు, యూనిఫామ్ విశ్రాంతి గదులు, ఈఎస్ఐ పీఎఫ్ సక్రమంగా కట్టాలని డబల్ డ్యూటీలకు రెట్టింపు వేతనం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు.
నైట్ అవుట్ అలవెన్సులు ఘాట్‌రోడ్ అలవెన్స్, అక్రమ రికవరీలు ఆపాలని కక్ష పూర్వకంగా ఆపేసిన డ్రైవర్లను వెంటనే విధులు లోకి తీసుకోవాలని కోరుతూ అలిపిరి డిపో ఎదురుగా ధర్నాకు దిగారు ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు.
ఈ ధర్నాలోయూనియన్ గౌరవాధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయ చంద్ర, కార్మికులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని... దీనికి భక్తులు సహకరించాలని కోరుతున్నామని అన్నారు
