ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్‌‌‌‌ గా దాన కిషోర్

ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్‌‌‌‌ గా దాన కిషోర్

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్‌‌‌‌గా గవర్నర్ స్పెషల్ సీఎస్  దాన కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం  లోక్ భవన్‌‌‌‌లో జరిగిన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ ( ఎస్ఎంసీ ) సమావేశంలో కమిటీ సభ్యులు దాన కిషోర్‌‌‌‌ను రాష్ట్ర శాఖ చైర్మన్‌‌‌‌గా ఎన్నుకున్నారు. 

అంతకుముందు, గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా,  దాన కిషోర్‌‌‌‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా నామినేట్ చేయగా, మేనేజింగ్ కమిటీ ఈ నామినేషన్‌‌‌‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. చైర్మన్ ఎన్నికతో పాటు యూత్ రెడ్ క్రాస్ కమిటీ, జూనియర్ రెడ్ క్రాస్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, నషా ముక్త్ భారత్ కమిటీ, విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ రెస్పాన్స్) కమిటీలకు కూడా రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంది.