ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ పై వేటు పడింది. కొన్ని రోజులుగా వరుస వివాదాలతో వార్తల్లోకెక్కిన రిమ్స్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిమ్స్ డైరెక్టర్ గా ఉన్న జైసింగ్ రాథోడ్ పై వేటు వేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్ధూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ఇన్చార్జి డైరెక్టర్గా బదిలీ చేశారు.
సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ బలరాం చిట్కేను రిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ గా నియమించారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకట్ లకావత్ ను రిమ్స్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసిఫాబాద్ మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ గా డాక్టర్ శ్రీలక్ష్మిని నియమించారు.
