హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు పడింది. నాగర్‌కర్నూల్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. ఇటీవల రిమ్స్‌లో చోటుచేసుకున్న వరుస వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ బాలి రామ్ చిట్కే నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం (నవంబర్ 14) రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బలరామ్ చిట్కే ప్రస్తుతం సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకట్ లకావత్
ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వెంకట్ లకావత్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
కేబీ ఆసిఫాబాద్ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి. శ్రీలక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి. శ్రీలక్ష్మిని ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా నియమించింది.
