టెహ్రాన్: హార్మూజ్ జలసంధిలో నౌకల ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. జలసంధిలో ఇరాన్ అమర్చిన సీమైన్స్ ను తాకి పలు నౌకలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇరాన్ అధికారులు తెలిపిన ప్రకారం.. శనివారం హార్మూజ్‌లోని నిషేధిత ప్రాంతాల్లో ప్రయాణించిన మూడు ఆయిల్ ట్యాంకర్లు మైన్లను ఢీకొన్నాయి.
దీంతో వాటిలో మంటలు చెలరేగాయి. అనుమతిలేకుండా ప్రయాణించే నౌకలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. కాగా, వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని, సముద్ర ప్రయాణ భద్రతను పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి(యూఎన్) కోరింది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి హార్మూజ్, పరిసర ప్రాంతాల్లో కనీసం 25 మంది నావికులు చనిపోయారని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది.
