ట్రంప్, జిన్‌‌‌‌‌‌‌‌పింగ్, పుతిన్‌‌‌‌‌‌‌‌ ల  చరిత్రాత్మక భేటీ..! 19న చైనాలో జరగనున్న ఏపీఈసీ శిఖరాగ్ర సదస్సు...

ట్రంప్, జిన్‌‌‌‌‌‌‌‌పింగ్, పుతిన్‌‌‌‌‌‌‌‌ ల  చరిత్రాత్మక భేటీ..! 19న చైనాలో జరగనున్న ఏపీఈసీ శిఖరాగ్ర సదస్సు...
  • హాజరుకానున్న అమెరికా, చైనా, రష్యా దేశాల అగ్రనేతలు
  • తొలిసారి ఒకే వేదికపైకి మూడు అగ్రరాజ్యాల అధినేతలు 

బీజింగ్/వాషింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన ముగ్గురు దేశాధినేతలు వచ్చేవారం భేటీ కానున్నారు. అమెరికా, చైనా, రష్యా దేశాల ప్రెసిడెంట్లు డొనాల్డ్ ట్రంప్, జిన్‌‌‌‌‌‌‌‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌‌‌‌‌‌‌‌ల మధ్య చైనాలో ఈ సమావేశం జరగనుంది. ఈ మూడు అణు దేశాల అధినేతలు ఇలా ఒకే వేదికపై కలవడం ఇదే తొలిసారి. చైనాలోని ప్రముఖ సాంకేతిక కేంద్రమైన 'షెంజెన్' వేదికగా జరగనున్న ఆసియా–-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నవంబర్​19న ఈ సమావేశం జరగనుంది. ఈమేరకు శుక్రవారం ఈ విషయాన్ని వైట్‌‌‌‌‌‌‌‌హౌస్ అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రతీకాత్మకమే కానీ.. భారీ అంచనాలు లేవు..

అగ్రరాజ్యాల అధినేతల ఈ అపూర్వ కలయిక చరిత్రాత్మక ఘట్టమే అయినప్పటికీ, దీనివల్ల ఎలాంటి సంచలనాత్మక ఒప్పందాలు కుదిరే అవకాశంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆచరణాత్మక అంశాల కంటే ప్రతీకాత్మకతకే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. 

ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న తరుణంలో అధినేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరితో ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం తర్వాత అమెరికా, రష్యాల అణు ఆయుధాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పోయాయి. చైనాను కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక కొత్త అణు ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నారు. 

రష్యా, చైనాల ఎత్తుగడలు..

అమెరికా, చైనాలతో సమానంగా తాము కూడా ఒక అగ్రరాజ్యమేనని ప్రపంచానికి చాటిచెప్పడానికి పుతిన్‌‌‌‌‌‌‌‌కు ఈ సమావేశం ఒక సువర్ణావకాశంగా మారింది. ఉక్రెయిన్ భవిష్యత్ గురించి తమ ముగ్గురిదే తుది నిర్ణయం అన్న సంకేతాలు పంపాలని పుతిన్ భావిస్తున్నారు. 

అయితే, తమ ప్రమేయం లేకుండానే ఉక్రెయిన్ ఒప్పందాలు జరిగిపోతాయేమోనని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయంగా చైనా తన పెత్తనాన్ని, సత్తాను మరోసారి ప్రదర్శించాలని చూస్తోంది. ఈ త్రిముఖ భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.