భారత పర్యటనకు పాకిస్తాన్ మంత్రి

భారత పర్యటనకు పాకిస్తాన్ మంత్రి

న్యూఢిల్లీ: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఒకరు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. షాహీ కట్టుబాట్లు, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి సంబంధించి షాంఘై సహకార సంస్థ(ఎస్ సీవో) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్ కు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుకానున్నారు. 

అంతకుముందు 2023 మే నెలలో గోవాలో ఎస్ సీవో విదేశాంగ మంత్రుల సమావేశం జరగగా పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. భుట్టో తర్వాత సుమారు మూడేళ్ల కాలంలో పాకిస్తాన్ నుంచి ఒక కేంద్ర మంత్రి భారత్‌‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.