ఇండోర్: టీమిండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మెన్స్ టీ20 క్రికెట్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో శనివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ (15 ఏళ్ల 232 రోజులు) బిహార్ జట్టుకు సారథ్యం వహించడంతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో క్రొయేషియా ప్లేయర్ జాక్ వుక్సిక్ (17 ఏళ్ల 311 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.
ఇక, సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బిహార్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ముందుగా బిహార్ 20 ఓవర్లలో 137/9 స్కోరు చేసింది. వైభవ్ (18) విఫలం కాగా, పృథ్వీ రాజ్ (38) రాణించాడు. తర్వాత సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 138/5 స్కోరు చేసి నెగ్గింది. హర్వంశ్ పంగాలియా (33) మెరుగ్గా ఆడాడు. ఐదు నెలల కిందట టీమిండియాకు ఎంపికైన వైభవ్.. దులీప్ ట్రోఫీలో బిహార్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
