కోల్‌కతా: బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీని ఓటమితో మొదలుపెట్టింది. ఛేజింగ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60 నాటౌట్) దుమ్మురేపడంతో గ్రూప్–డిలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. టాస్ ఓడిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 రన్స్‌కు ఆలౌటైంది.
అభిరత్ రెడ్డి (35) టాప్ స్కోరర్. హిమతేజ (25), చామ మిలింద్ (22) ఫర్వాలేదనిపించారు. తర్వాత ముంబై 13.1 ఓవర్లలో 174/3 స్కోరు చేసి నెగ్గింది. ముషిర్ ఖాన్ (51), అంగ్క్రిష్ రఘువంశీ (27), హార్దిక్ టమోరే (22) రాణించారు. సూర్యకుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
