ఆరోగ్యశ్రీ డేటాతో రోగాల మూలాలపై పరిశోధన..రూ.12 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

ఆరోగ్యశ్రీ డేటాతో రోగాల మూలాలపై పరిశోధన..రూ.12 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
  •     38 వేల పడకలతో మెడికల్ టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ
  •     గ్లోబల్ హెల్త్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పీహెచ్ఎఫ్ఐ యూనివర్సిటీ

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ ద్వారా గత 20–25 ఏండ్లలో సేకరించిన కోట్లాది మంది రోగుల చికిత్స వివరాలను విశ్లేషించి, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులకు కారణాలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐఎస్బీ, నల్సార్ తరహాలో పీహెచ్ఎఫ్ఐ కూడా అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు రూ.12 వేల కోట్లతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రస్తుతం 38 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ టీమ్స్ పూర్తయిందని, ఆరు నెలల్లో అల్వాల్, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయ్యి పడకల చొప్పున ఆస్పత్రులు ప్రారంభిస్తామని చెప్పారు. 

గోషామహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 వేల పడకల ఉస్మానియా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయ్యి పడకల ఎంజీఎం ఆస్పత్రి నిర్మిస్తున్నామని, దీంతో మధ్యప్రాచ్య, ఆసియా దేశాల రోగులకు తెలంగాణ మెడికల్ టూరిజం కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, డాక్టర్ నోరి దత్తాత్రేయుడి సూచనతో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించామని వెల్లడించారు. మూసీ కాలుష్యం నల్గొండలో పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని, అందుకే నది ప్రక్షాళన చేపట్టామని వివరించారు.

తెలంగాణలో పాలసీ పక్షపాతం లేదు

రాష్ట్రంలో పాలసీ పక్షపాతం లేదని, గత ప్రభుత్వాలు అనుసరించిన మంచి పారిశ్రామిక విధానాలనే తాము కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు. పీవీ నరసింహారావు 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. వచ్చే జనవరి తర్వాత హార్వర్డ్, ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ వంటి వర్సిటీల ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షోర్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానున్నాయని తెలిపారు. తెలంగాణ రక్షణ, ఫార్మా రంగాల్లో కీలక కేంద్రంగా ఎదిగిందని, ఫ్రాన్స్ వెలుపల రాఫెల్ విమానాల ఏకైక ఎంఆర్వో కేంద్రం జీఎంఆర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఉందన్నారు. 

1965లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐడీపీఎల్ ఏర్పాటుతో శిక్షణ పొందిన శాస్త్రవేత్తలే డాక్టర్ రెడ్డీస్, హెటెరో, అరబిందో, బయోలాజికల్ ఈ, శాంతా బయోటెక్ సంస్థలను స్థాపించారని, దేశ బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 40% తెలంగాణ నుంచే జరుగుతున్నా యని చెప్పారు. బయోలాజికల్ ఈతో కలిసి ఎలీ లిల్లీ సంస్థ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోం దని, హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలకు అడ్డాగా మారిం దన్నారు. పీహెచ్ఎఫ్ఐ యూనివర్సిటీకి భూమి, నిధులు, అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని, తాను బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ట్రస్టీగా ఉంటానన్నారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి, పీవీ జయంతి అయిన జూన్ 28న వర్సిటీని ప్రారంభించాలని గడువు విధించారు.