- జనరల్ సెక్రటరీగా సతీశ్ ఎన్నిక
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫార్మసీ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్‌గా పుల్లా రమేశ్ బాబు, జనరల్ సెక్రటరీగా కడియాల సతీశ్ ఎంపికయ్యారు. చీఫ్ అడ్వైజర్‌గా కె.రాందాస్, గౌరవ అధ్యక్షుడిగా టి. జయపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా ఎ. ప్రభాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, హబీబుద్దీన్, జాయింట్ సెక్రటరీగా తల్లా వరుణ్, ఈసీ మెంబర్లుగా మధుసూదన్ రెడ్డి, చిరంజీవి, నవీన్ నియమితులయ్యారు.
నూతన ప్రెసిడెంట్ రమేశ్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫార్మసీ విద్యారంగానికి సంబంధించి 98 శాతం ప్రాతినిధ్యం తమ అసోసియేషన్‌దేనని, తెలంగాణలో 120 ప్రైవేట్, 3 ప్రభుత్వ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 90 శాతం కాలేజీలు కేవలం ట్యూషన్ ఫీజుల ఆధారంగానే నడుస్తున్నాయని ఆయన వివరించారు. వెంటనే ఫీజు బకాయిలు రిలీజ్చేయాలని డిమాండ్‌చేశారు.
