రోగుల సంఖ్య పెరగడంతోనే.. మందులకు డిమాండ్.. వెలుగు కథనంపై మెడికల్ కార్పొరేషన్ వివరణ

రోగుల సంఖ్య పెరగడంతోనే.. మందులకు డిమాండ్.. వెలుగు కథనంపై మెడికల్ కార్పొరేషన్ వివరణ

హైదరాబాద్, వెలుగు: శనివారం వెలుగు దినపత్రికలో ‘సర్కారు దవాఖానాల్లో మందుల కొరత!’ పేరుతో ప్రచురితమైన కథనంపై తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌‌‌‌ఐడీసీ) వివరణ ఇచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతోనే టెల్మిసార్టన్, పాంటోప్రజోల్, మెట్‌‌‌‌ఫార్మిన్ తదితర అత్యవసర మందుల వినియోగం, డిమాండ్ ఎక్కువయ్యాయని, అందుకు అనుగుణంగా అదనపు నిల్వలు అవసరమవుతున్నాయని పేర్కొంది.

మెట్‌‌‌‌ఫార్మిన్ ట్యాబ్లెట్లకు సంబంధించి ఇటీవలే రేట్ కాంట్రాక్ట్ ఖరారైనప్పటికీ ప్రస్తుత ఆర్‌‌‌‌సీ కింద సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదని, అందువల్ల నిరంతర సరఫరా, లభ్యత కోసం కొత్త టెండర్ పిలవాలని ప్రతిపాదించినట్లు తెలిపింది. ప్రస్తుతం సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) వద్ద మెట్‌‌‌‌ఫార్మిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు జనరల్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్, ఎన్పీసీడీసీఎస్ నిల్వ ఉన్నాయని వెల్లడించింది. అలాగే టెల్మిసార్టన్ 40 ఎంజీ, పాంటోప్రజోల్ ట్యాబ్లెట్లను కూడా ప్రస్తుత ఆర్‌‌‌‌సీ ప్రకారం సరఫరా చేయడానికి సంస్థలు విముఖత చూపడంతో, ఆ రెండింటినీ టెండర్ నెం. 2/2026–-27లో చేర్చినట్లు తెలపింది. ఈ టెండర్ ప్రస్తుతం ప్రైస్ బిడ్ ఓపెనింగ్ దశలో ఉండి, తదుపరి చర్యల నిమిత్తం బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్‌‌‌‌సీ) ముందుంచడానికి సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు. అవసరమైనన్ని మందుల కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.