రాత పరీక్ష లేకుండా రైల్వే సంస్థలో 281 అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే

రాత పరీక్ష లేకుండా రైల్వే సంస్థలో 281 అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్  వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 281 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 281. 
విభాగాల వారీగా ఖాళీలు
గ్రాడ్యుయేట్​ ఇంజినీరింగ్ 125: సివిల్ ఇంజినీరింగ్ 40, ఆర్కిటెక్చర్ 2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 26, సిగ్నల్ అండ్ టెలికాం 2, మెకానికల్ ఇంజినీరింగ్ 36, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ13, కెమికల్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్ 6.
గ్రాడ్యుయేట్ నాన్ – ఇంజినీరింగ్ 43: ఫైనాన్స్ 21, హ్యూమన్ రిసోర్సెస్ 22. 
డిప్లొమా 62:  సివిల్ ఇంజినీరింగ్ 12, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 19, మెకానికల్ ఇంజినీరింగ్ 26, కెమికల్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్ 5.
ఐటీఐ ట్రేడ్ 51:  సివిల్ 2, ఎలక్ట్రికల్ 23, మెకానికల్ 23, ఇతర ట్రేడులు 3.

విద్యార్హతలు

గ్రాడ్యుయేట్ఇంజినీరింగ్: సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బి.ఆర్కిటెక్చర్ పూర్తిచేసి ఉండాలి.
 గ్రాడ్యుయేట్ నాన్ - ఇంజినీరింగ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ/ బి.కాం/ బీబీఏ/ బీఎస్సీ లేదా బీసీఏ పూర్తిచేసి ఉండాలి.  
డిప్లొమా: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
 ఐటీఐ ట్రేడ్: సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
పై విద్యార్హతల్లో జనరల్/ అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
2021, నవంబర్ 5 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తిచేసిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. ఐటీఐకు నిర్దిష్ట సంవత్సరాన్ని పేర్కొనలేదు.
వయసు: 2026, నవంబర్ 5 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితిని పేర్కొనలేదు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అకడమిక్​లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా అర్హులైన అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rites.comను సందర్శించండి.