కుమమోటో: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కుమమోటో మాస్టర్స్ జపాన్ సూపర్–500 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో లక్ష్య 21–12, 15–21, 21–11తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా)పై పోరాడి గెలిచాడు. దాంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలను ఇండియన్ ప్లేయర్ మెరుగుపర్చుకున్నాడు.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రెండో గేమ్ కోల్పోయిన లక్ష్య పట్టువదలకుండా పోరాడాడు. గతంలో ఫర్హాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లక్ష్య ఈ సారి తన వ్యూహాన్ని మార్చాడు. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో హోరెత్తించాడు.
