IPL మాజీ చైర్మన్‌కు బ్రిటన్ పౌరసత్వం.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

IPL మాజీ చైర్మన్‌కు బ్రిటన్ పౌరసత్వం.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Lalit Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ (Lalit Modi) కీలక ప్రకటన చేశారు. తాను అధికారికంగా బ్రిటిష్ పౌరసత్వం (British Citizenship) పొందినట్లు ఆయన వెల్లడించారు. నిన్న (2026, నవంబర్ 14, శనివారం) ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనియన్ (Oxford Union) వేదికగా ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 15న తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రిటిష్ పౌరసత్వాన్ని స్వీకరించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

నా జీవితంలో ఇదే గర్వకారణం.. ఇదొక కొత్త అధ్యాయం: 

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లలిత్ మోడీ భావోద్వేగపూరిత నోట్ రాశారు.. నవంబర్ 14, 2026న ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో ప్రసంగించే గౌరవం నాకు దక్కింది.. నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన మైలురాయిని పంచుకున్నాను.. నేను బ్రిటిష్ పౌరుడినని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను.. సెప్టెంబర్ 15, 2026న కుటుంబం, స్నేహితుల మధ్య జరిగిన పౌరసత్వ వేడుక నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని లలిత్ పేర్కొన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ నా ఇల్లు: చాలా సంవత్సరాలుగా బ్రిటన్ తనకు నివాసంగా ఉందని, ఇక్కడి ప్రజలు, సంస్థలు, సంప్రదాయాలు, విలువలను తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. బ్రిటిష్ పౌరుడిగా మారడం కేవలం ఒక గౌరవం మాత్రమే కాదని, అదొక బాధ్యత అని ఆయన అభివర్ణించారు.

కింగ్ చార్లెస్ III పుట్టినరోజున ప్రకటన.. గాడ్ సేవ్ ది కింగ్: 

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III పుట్టినరోజు నాడే ఈ శుభవార్తను పంచుకోవడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని లలిత్ మోడీ తెలిపారు. విభిన్న సంస్కృతులు, అనుభవాలతో నా జీవిత ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు నేను గర్వంగా నా ఇల్లు అని పిలుచుకునే ఈ దేశ అభివృద్ధికి నా వంతు సహకారం అందించడానికి ఎదురుచూస్తున్నాను.. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబం, స్నేహితులు, ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌కు ధన్యవాదాలు.. ఇదొక కొత్త అధ్యాయం. గాడ్ సేవ్ ది కింగ్ అంటూ లలిత్ మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.