- పరిశోధనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించాలి
పంజాగుట్ట, వెలుగు: సౌరశక్తిని సమర్థంగా వినియోగించుకుంటూ పర్యావరణ ప్రభావాలను తగ్గించే సురక్షిత ఎస్ఎల్‌ఏపీ(సెమీకండక్టర్ అండ్ లిక్విడ్ అసిస్టెడ్ ఫోటోథెర్మల్ ఎఫెక్ట్) టెక్నాలజీని డెవలప్చేస్తున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ ఇబ్రామ్ గణేశ్తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లుగా సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం పెంపుపై పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత సోలార్ ప్యానెళ్లలో వృథా అవుతున్న ఉష్ణశక్తిని సేకరించి, అదనపు విద్యుత్, వేడి నీటిని ఉత్పత్తి చేయవచ్చన్నారు. సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించి సింథటిక్ ఇంధనాలను తయారు చేస్తే విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. రక్షణ రంగ క్షిపణి సాంకేతికతలోనూ అనుభవమున్న తన బృందం సొంత నిధులతో ఈ పరిశోధనలు చేస్తోందని చెప్పారు.
దేశ ఇంధన స్వావలంబనకు తోడ్పడే ఈ ఆవిష్కరణలను గుర్తించి, ఆర్థిక సహకారం, ప్రయోగశాలల ఏర్పాటు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు.
