సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారం :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     కేటీఆర్ మాట్లాడేముందు ఆలోచించుకోవాలని హితవు 

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర చారిత్రాత్మకమని, ఆమె లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. గతంలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీని తెలంగాణ దేవతగా అభివర్ణించారని, కుటుంబంతో సహా వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారని మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, కేటీఆర్ లాగా తండ్రి చాటు కుమారుడు కాదని, దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చారని పేర్కొన్నారు. 

దేశమే తన కుటుంబంగా భావిస్తూ రాహుల్ గాంధీ నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నారని, త్వరలోనే ఆయన దేశ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అడ్డగోలు హామీలతో మోసం చేశారు. గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి విమర్శలు గుప్పిస్తూ.. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. అడ్డగోలు హామీలతో పదేండ్ల పాటు మైనారిటీలు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చి, పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి వివరించారు.