మేడ్చల్‌‌‌‌‌‌‌‌-మల్కాజిగిరి జిల్లాలో రెండు చెరువులకు హైడ్రా ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌

మేడ్చల్‌‌‌‌‌‌‌‌-మల్కాజిగిరి జిల్లాలో రెండు చెరువులకు హైడ్రా ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా శనివారం మరో రెండు చెరువులకు రక్షణ కల్పించింది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌-–మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌‌‌‌‌‌‌‌ మండలం దొమ్మరపోచంపల్లిలోని 3.11 ఎకరాల గొల్లవానికుంటలో మట్టి పోసి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరగడంతో హైడ్రా అధికారులు దాని చుట్టూ ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేయించారు. చెరువు భూమిగా గుర్తిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 

ఇదే జిల్లాలోని కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం గాజులరామారం దేవేందర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 27 ఎకరాల విస్తీర్ణం కలిగిన చింతల చెరువును కూడా కాపాడారు. సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 329లో గతంలో ఆక్రమణలు తొలగించినప్పటికీ మళ్లీ తాత్కాలిక షెడ్లు నిర్మించి కబ్జాలకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం చెరువుకు చెందిన 9 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసి, బోర్డులు ఏర్పాటు చేశారు.