పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక..అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక..అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి
  • ప్రధాన కార్యదర్శిగా శేఖర్ రావు

హైదరాబాద్, వెలుగు: పీఆర్టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బట్టాపురం మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కట్టా శేఖర్ రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సుంకరి భిక్షం గౌడ్ అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ పొందడంతో ఏర్పడిన ఖాళీలో, ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న కట్టా శేఖర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శనివారం నారాయణగూడలోని పీఆర్టీయూ భవన్ సమావేశ మందిరంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భిక్షం గౌడ్​ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.