వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో తలపడే ఇండియా టెస్ట్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. పేసర్ గుర్నూర్ బ్రార్‌ను కొత్తగా టెస్ట్ టీమ్‌లోకి తీసుకోగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించారు. పిచ్ పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది.
‘బ్రార్‌కు అదనపు బౌన్స్ రాబట్టే సామర్థ్యం ఉంది. కాబట్టి టెస్ట్ జట్టులోకి తీసుకొచ్చాం. ఐదో వన్డేకు అతను అందుబాటులో ఉండడు. టెస్ట్ సిరీస్‌లో బుమ్రాతో కలిసి ఆకాశ్ దీప్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగే చాన్స్ ఉంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమ్‌తో కలిశాడు’ అని బోర్డు పేర్కొంది. డొమెస్టిక్ క్రికెట్లో ఆడేందుకు కుల్దీప్ స్వదేశానికి రానున్నాడు. ఈ నెల 19 నుంచి తొలి టెస్ట్, 27 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.
