సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీలు

సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ శనివారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జీఎం నుంచి సీనియర్​ అండర్​ మేనేజర్​ హోదా వరకు ఆఫీసర్లు ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేట్​(పీపీ) జీఎంగా పనిచేస్తున్న గాజర్ల దేవేందర్​ను కార్పొరేట్​ (సీపీఅండ్​పీ) వింగ్​కు, కార్పొరేట్​ సేఫ్టీ జీఎం కమాలకార సాయిబాబును కార్పొరేట్​ (పీపీ) వింగ్​కు, కొత్తగూడెం రీజియన్​ సేఫ్టీ జీఎంగా పనిచేస్తున్న కృష్ణ గోపాల్ తివారీని కార్పొరేట్​ సేఫ్టీ జీఎంగా బదిలీ చేసింది. 

అడ్రియల్​ ఏరియా ఏజీఎంగా కొనసాగుతున్న బండి సత్యనారాయణకు ప్రమోషన్​ కల్పిస్తూ కొత్తగూడెం రీజియన్​ జీఎం సేఫ్టీగా నియమించింది. కొత్తగూడెం ఏరియా సేఫ్టీ డీజీఎం మెక్కపాటి వెంకటేశ్వర్​రావును సత్తుపల్లి ఏరియా ఏస్వోటుజీఎంగా, సత్తుపల్లి ఏస్వోటుజీఎం బొల్లం శ్రీనివాస్​ను సత్తుపల్లి ఏరియా కిష్టారం ఓసీపీ పీవోగా, కిష్టారం ఓసీపీ పీవో ఏఎల్ఎస్ వీ సునీల్​ వర్మను సత్తుపల్లి జేవీఆర్​ ఓసీపీ2 పీవోగా నియమిస్తూ ట్రాన్స్​ఫర్​ చేసింది.

 మణుగూరు ఏరియా సేఫ్టీ మేనేజర్​ను అదే ఏరియా ఎంవీటీసీకి, పీకే ఓసీపీ మేనేజర్​ను మణుగూరు ఏరియా సేఫ్టీ ఆఫీసర్​గా, భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీపీ3 మేనేజర్​ను అదే ఏరియా సేఫ్టీ ఆఫీసర్​గా, మందమర్రి ఏరియా శాంతిఖని గని మేనేజర్​ సంజయ్​కుమార్​ సిన్హాను కొత్తగూడెం ఏరియా సేఫ్టీ ఆఫీసర్​గా, రామగుండం1 ఏరియా జీడీకే సీఎం మేనేజర్​ అనిల్​ గబాలెను మణుగూరు ఏరియా పీకే ఓసీపీకి, రామగుండం1 ఏరియా క్వాలిటీ వింగ్​ మేనేజర్​ బ్రహ్మాజీ రావును అదే ఏరియా సేఫ్టీ వింగ్​ మేనేజర్​గా బదిలీ చేసింది. మరో ఏడుగురు అడిషనల్, డిప్యూటీ, సీనియర్​ అండర్​ మేనేజర్లను సింగరేణి యాజమాన్యం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.