హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ బాలి రామ్ చిట్కేను నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం (నవంబర్ 14) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుత ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. జై సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ, నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రియను రిలీవ్ చేసింది. ఆమె నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రసూతి, స్త్రీ వ్యాధుల విభాగం (ఓబీజీ) ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకట్ లకావత్
ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వెంకట్ లకావత్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
కేబీ ఆసిఫాబాద్ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి. శ్రీలక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి. శ్రీలక్ష్మిని ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా నియమించింది.
►ALSO READ | ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు
