న్యూఢిల్లీ: భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనేది వాస్తవమని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. పెగాసస్ స్పైవేర్ వివాదం సమయంలో తన ఫోన్ కూడా నిఘా నీడలోనే ఉందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై శుక్రవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పీకే స్పందించారు.
దేశంలో ఫోన్ల ట్యాపింగ్ ఎప్పట్నుం చో జరుగుతోందని, ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గ్రహించాలని చెప్పారు. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ టార్గెట్ల జాబితాలో తన పేరు ఉన్నప్పుడే తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు తెలిసిందన్నారు.
