పరాక్రమం, నిర్భంధం లాంటి చిత్రాలతో మెప్పించిన బండి సరోజ్ .. ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ, తనే హీరోగా నటిస్తున్నారు. సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో, టీజర్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నాం. కానీ ఇండస్ట్రీలో, సెట్‌లో నిర్మాతకు సెక్యూరిటీ లేదు. డబ్బును నేను లెక్కచేయను. కానీ కళ అనేది ఖజానా.
దానికోసమే బతుకుతున్నా. గత రెండేళ్లుగా కష్టపడి పటిష్టమైన స్క్రీన్ ప్లేతో ఈ స్టోరీ రాస్తే, సినిమాకెంతో కీలకమైన సీన్‌ను ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశారు. అందుకే ఇంత త్వరగా టీజర్ రిలీజ్ చేశాం. సమ్మర్‌లో సినిమాతో కలుద్దాం’ అని చెప్పారు. సరోజ్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉందని నటుడు ప్రవీణ్ చెప్పారు. నటీనటులు ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, రమేష్, జీవా, అజయ్ సాయి, ప్రమోద్ పడమటి తదితరులు పాల్గొన్నారు.
