అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం ‘విసా : వింటారా సరదాగా’. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ ట్రీట్‌గా జనవరి 1న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో లవ్, ఫ్రెండ్‌షిప్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలియజేశారు.
ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం సాగుతుందని చెప్పారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు, సత్య, గుండు సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
