అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘మాటలు రాని హీరోతో ఒక కథ చెప్పడం ఈజీ కాదు. మహేష్ చాలా బాగా తీశాడు.
రోజురోజుకీ వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతోంది. నిర్మాతగా వెంకీ ప్రొడక్షన్‌ను బాగా హ్యాండిల్ చేశాడు. అనస్వర పెర్ఫార్మెన్స్‌కు నేను ఫ్యాన్ అయిపోయా. ఇక అనీష్ హీరోగా పాస్ అయ్యాడు. తన విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ సినిమాను ప్రజెంట్ చేసినందుకు నా మాట నిలబెట్టారు. ఇది టీమ్ అందరి విజయం’ అని చెప్పారు.
క్లైమాక్స్‌లో ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే తొలి సినిమా నటుడిగా ఎంతో ఆనందమేసిందని, ఆ క్రెడిట్ దర్శకుడిదని, లవ్‌స్టోరీతో పాటు యాక్షన్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని హీరో అనీష్ చెప్పాడు. హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మహేష్ ఉప్పల, నిర్మాత వెంకీ కుడుముల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు.
- నాగార్జున
