నవ్వుల జాతరకు సిద్ధం.. సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్

నవ్వుల జాతరకు సిద్ధం.. సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్

ఎవరూ ఊహించని కొత్త కాంబినేషన్‌‌‌‌ను తెరపైకి తెచ్చి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. అనిల్ రావిపూడి డైరెక్షన్‌‌‌‌లో తాను నటించబోతున్నట్టు శనివారం (2026 నవంబర్ 15) ఆయన ప్రకటించారు. నవ్వుల విందుకు సిద్ధమవ్వండి అంటూ సోద‌‌‌‌రుడు క‌‌‌‌ళ్యాణ్ రామ్‌‌‌‌, దర్శకుడు అనిల్‌‌‌‌ రావిపూడితో కలిసి దిగిన ఫొటోస్‌‌‌‌ను తారక్‌‌‌‌ సోషల్‌‌‌‌మీడియా వేదికగా పంచుకున్నారు.  

త్రివిక్రమ్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లో చేయబోయే ‘గాడ్ ఆఫ్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌’ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించిన క్లారిటీ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేయడం విశేషం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌‌‌‌ర్‌‌‌‌పై  ఈ సినిమాను నిర్మించబోతున్న కళ్యాణ్​ రామ్.. తన డ్రీమ్ కాంబినేషన్‌‌‌‌ ఇదని చెప్పారు. 

 ‘పటాస్‌‌‌‌’తో అనిల్ రావిపూడికి దర్శకుడిగాతొలి ఛాన్స్‌‌‌‌ ఇచ్చింది కళ్యాణ్‌‌‌‌ రామ్ అనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు ఉన్న మాస్‌‌‌‌ ఇమేజ్‌‌‌‌తో పాటు ఆయనలోని కామెడీ టైమింగ్‌‌‌‌కు తగ్గట్టుగా అనిల్‌‌‌‌ రావిపూడి మార్క్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ రాబోతోందని సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ‘డ్రాగన్‌‌‌‌’ షూటింగ్‌‌‌‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో ‘గాడ్ ఆఫ్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌’లో నటించనున్నారు.