ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘటన

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘటన

గండిపేట, వెలుగు: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కేరళంలోని కన్నూర్​నుంచి శంషాబాద్‌‌‌‌‌‌‌‌ విమానాశ్రయానికి శనివారం ఉదయం 10.40 గంటలకు ఇండిగో విమానం వచ్చింది. అందులో సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు చేపడుతుండగా.. ఈ విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి రాసిన కాగితం బాత్రూమ్​లో కనిపించింది. దీంతో ప్రయాణికులను దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదు. ఇది ఆకతాయిల పనా లేక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

ప్రయాణికుడి బ్యాగులో లైవ్ బుల్లెట్.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో కలకలం 

శంషాబాద్‌‌‌‌‌‌‌‌ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో లైవ్ బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. శనివారం ఉదయం 7.34 గంటలకు చెక్‌‌‌‌‌‌‌‌-ఇన్ బ్యాగేజీ స్క్రీనింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మస్కట్ నుంచి హైదరాబాద్ మీదుగా గోరఖ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న రంగ్ లాల్ అనే ప్రయాణికుడి లగేజీలో 9 ఎంఎం లుగర్ రకానికి చెందిన ఒక తూటాను సిబ్బంది గుర్తించారు. 

కౌంటర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతోపాటు, తూటా గురించి ముందస్తుగా వెల్లడించలేదు. దీంతో భద్రతా సిబ్బంది బుల్లెట్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని తదుపరి చర్యల కోసం ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.