మానసతో మొదలైన జార్జ్ క్రిష్ డబ్బింగ్

మానసతో మొదలైన జార్జ్  క్రిష్  డబ్బింగ్

తనదైన గ్లామర్‌‌తో  ఆకట్టుకుంటున్న హీరోయిన్ మానస వారణాసి  ప్రస్తుతం ‘జార్జ్ క్రిష్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి  డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

మానస వారణాసి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్న వీడియోను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో శర్వానంద్  రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.  క్రిస్టియన్‌గా జార్జ్,  హిందువుగా క్రిష్ పాత్రల్లో ఆయన కనిపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బూస్టర్ ఆసక్తిని పెంచింది.

  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అజయ్ సుంకర కో ప్రొడ్యూసర్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా  జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.