గాంధీ దవాఖానకు 19 రిఫ్రిజిరేటర్లు విరాళం

గాంధీ దవాఖానకు 19 రిఫ్రిజిరేటర్లు విరాళం

పద్మారావు నగర్, వెలుగు: ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వీసీ పరేఖ్ చారిటబుల్ ట్రస్ట్ తన దాతృత్వాన్ని చాటుకుంది. ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు, మేనేజింగ్ ట్రస్టీ ప్రేమల్ సి.పరేఖ్ ఆధ్వర్యంలో శ్రీ గోపాల్ దాస్ ఝవేరి అండ్ శకుంతలా బాయి ఝవేరి చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఎస్ రెఫ్‌‌‌‌‌‌‌‌కాంప్ సంస్థల సహకారంతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు శనివారం 19 రిఫ్రిజిరేటర్లను విరాళంగా అందజేశారు.

 ప్రభుత్వ దవాఖానల అభివృద్ధికి, ప్రజా సేవకు వీసీ పరేఖ్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహకారం అభినందనీయమని గాంధీ హాస్పిటల్​సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి అన్నారు. రిఫ్రిజిరేటర్లు అందించిన ట్రస్ట్ నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.