డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి చిరంజీవి మద్దతు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాత్ర టీ షర్టుల ఆవిష్కరణ

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి చిరంజీవి మద్దతు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాత్ర టీ షర్టుల ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: మత్తుపదార్థాల మహమ్మారిపై సాగుతున్న పోరాటానికి సినీ నటుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్ లో జరగనున్న నషా ముక్త్ భారత్ యాత్ర నేపథ్యంలో ఈ మహా యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా చిరంజీవిని కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను చిరంజీవి ఆవిష్కరించారు. 

చిరంజీవి మాట్లాడుతూ.. సమాజాన్ని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తాము సైతం ఎల్లప్పుడూ చేయి కలుపుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.