బాలానగర్అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఎంపీ వంశీకృష్ణ.. బలహీనవర్గాలను విడదీసే కుట్ర జరుగుతుంది..!

బాలానగర్అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఎంపీ వంశీకృష్ణ.. బలహీనవర్గాలను విడదీసే కుట్ర జరుగుతుంది..!

 బాలానగర్ చిత్తరమ్మ నగర్  లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కారక్రమం జరిగింది.  ఈ కాక్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. అంబేద్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనన్నారు. కొంతమంది  బలహీన వర్గాలను విడదీసేందుకు  కుట్ర చేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఏది ఏమైనా బలహీన వర్గాలనేతలందరూ కలిసి ఉండాలన్నారు.

 అంబేద్కర్ విషయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి  ఎక్కడ తగ్గరంటూ.. తమ తాతగారైన వెంకటస్వామి స్ఫూర్తితోనే  తన తండ్రిగారైన మంత్రి వివేక్​.. తాను నడుస్తున్నానని చెప్పారు. గిగ్ వర్కర్ల కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసన్నారు.  రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్లు కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి మంత్రి వివేక్ ఎంతో కష్టపడ్డారంటూ  ప్రైవేట్ కార్మికులకు పిఎఫ్ తీసుకురావడంలో మా తాతగారు కాకా ఎంతో కృషి చేశారని తెలిపారు.

 ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఎంతో కష్టపడ్డ మనిషి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటూ.. బలహీన వర్గాల అభివృద్దికి 70 ఏళ్ల క్రితమే ఆలోచించారని తెలిపారు.. రాజ్యాంగం ప్రకారం అందరిని సమానంగా చూడాలంటూ..  బలహీన వర్గాలను వేరుగా చూడొద్దని కోరారు.  చాలామంది రిటైర్డ్ ఎంప్లాయిస్ తనను  కలుస్తున్నారని.. వాళ్ల పెన్షన్ సమస్యలను  పార్లమెంటులో  కచ్చితంగా మాట్లాడతానని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.