మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. బావ బామ్మర్దుల మధ్య జరిగిన ఈ వివాదంలో బావ ప్రాణాలు కోల్పోయాడు. అవుషాపూర్‌లోని జగత్ స్వప్న విల్లాస్‌లో ఘటన జరిగింది.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవూష పూర్ లో సెక్యూరిటీ గార్డ్స్ గా బావ ..బామమరిది పని చేస్తున్నారు. మద్యం సేవించిన మత్తులో ఇద్దరికి మాటా మాటా పెరగడంతో బావ విజయ్ తలపై బామ్మర్ది శ్రీనివాస్ రాయితో కొట్టాడు. దీంతో అక్కడిక్కడక్కడే విజయ్ మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్తెనపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
