నిరుపేద రైతులకు భూమి పట్టా చేయాలి: సీపీఎం నేత అంజయ్య డిమాండ్

నిరుపేద రైతులకు భూమి పట్టా చేయాలి: సీపీఎం నేత అంజయ్య డిమాండ్

యాచారం, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేఖుర్డు రెవెన్యూ పరిధిలోని ధర్మన్నగూడకు చెందిన నిరుపేద రైతులు తేరటి పుణ్యాలు, నిర్మలకు సర్వే నంబర్ 167లోని 3 ఎకరాల 20 గుంటల భూమిని ఆకుల కోటయ్య వెంటనే పట్టా చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పెరుమాండ్ల అంజయ్య డిమాండ్ చేశారు. బాధితులు గ్రామ పంచాయతీ వద్ద చేపట్టిన రెండో రోజు దీక్షలకు సీపీఎం మండల కమిటీ సభ్యులు మండల బాలరాజ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అంజయ్య మాట్లాడుతూ 40 ఏండ్ల కింద డబ్బులు తీసుకుని, అగ్రిమెంట్ రాసి, డాక్యుమెంట్ నంబర్ 1277/1992తో ఒప్పంద పత్రం ఇచ్చి పట్టా చేస్తానని నమ్మించి ఆకుల కోటయ్య బాధితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లుగా కాలయాపన చేస్తూ, తన కొడుకు ఆకుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీపీఏ చేయించి నిరుపేదల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు.

గ్రామ పెద్దలు సైతం తమ సమక్షంలోనే ఒప్పందం జరిగిందని, పత్రంపై తాము సంతకాలు చేశామని పేర్కొంటూ ఆకుల కోటయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలరాజ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమన్నారాయణ తదితరులున్నారు.