ప్రేమ పేరుతో వేధింపులు ? యువ క్రికెటర్ఆత్మహత్య.. వికారాబాద్లో ఘటన

ప్రేమ పేరుతో వేధింపులు ? యువ క్రికెటర్ఆత్మహత్య.. వికారాబాద్లో ఘటన

వికారాబాద్​, వెలుగు: ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువ క్రికెటర్ ​ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ ​జిల్లా యాలాల మండలంలోని సంగాయిపల్లికి చెందిన నందిని (17) వికారాబాద్​లోని మేనమామ దగ్గర ఉంటోంది. ఈమె జిల్లా స్థాయిలో క్రికెటర్​గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, గురువారం సాయంత్రం నందిని తన మేనమామ ఇంట్లో ఫ్యాన్​కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నందిని మేనమామ రమేశ్​ గమనించి ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

అయితే, నందిని మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందినిని ప్రేమిస్తున్నామంటూ ఇద్దరు యువకులు వెంటపడుతున్నారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కంప్లయింట్​లో పేర్కొన్నాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వికారాబాద్ ​సీఐ రఘుకుమార్​ తెలిపారు.